ఎన్టీఆర్ కన్నా ఘనుడు బాబు: మంత్రులు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎన్టీ రామారావును మించిన నటుడని రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తాను మారానని చంద్రబాబు చేసిన ప్రకటనను వారు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్నిసార్లు మారుతారని వారన్నారు. తాను మారానని ఇంత ముందు కూడా ప్రకటించారని, అది అబద్ధమా అని వారన్నారు. చంద్రబాబు సహజ నటుడని, నటనలో ఎన్టీఆర్ ను మించారని వారన్నారు.
పార్టీలో ఒక్కరు కూడా మిగలరనే భయంతో తాను మారినట్లు చంద్రబాబు ప్రకటన చేశారని, అదంతా నాటకమని వారన్నారు. నాటకాల్లో వేషాలు మార్చినట్లు చంద్రబాబు నిజ జీవితంలో వేషాలు మారుస్తారని వారు వ్యాఖ్యానించారు. చంద్రబాబు మారడమనేది జరిగే పని కాదని, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదనేది చంద్రబాబు విషయంలో సత్యమని వారన్నారు.












Click it and Unblock the Notifications