పార్టీపై చీలిక ప్రభావం ఉండదుః కుమారస్వామి
బెంగళూరు: చీలిక ప్రభావం తమ పార్టీపై ఉండదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (ఎస్) నేత కుమారస్వామి పేర్కొన్నారు. వారు రాజీనామా చేసిన నేపథ్యంలో వారి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉందన్నారు.
బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం డిసెంబర్ 16నుంచి తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నానని తెలిపారు. చీలిక కారణంగా పార్టీకి ఏర్పడే నష్టాన్ని నివారించేందుకే ఆయన ఈ పర్యటన తలపెట్టారని పరిశీలకులు చెబుతున్నారు.
పార్టీకి గట్టి మద్దతుదారుగా నిలిచిన లింగాయత్ వర్గానికి చెందిన మాజీ హోం మంత్రి ఎంపీ ప్రకాష్ నేతృత్వంలో 12మంది మాజీ శాసనసభ్యులు మంగళవారం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు సైతం సొంత బాటను అనుసరించాలనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
