పోలీసు స్టేషన్ ను పేల్చి వేసిన మావోయిస్టులు
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఓ పోలీసు స్టేషన్ ను పేల్చివేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారితో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. బస్తర్ జిల్లాలోని బిస్రాం పూర్ పోలీసు స్టేషన్ లో ఈ సంఘటన జరిగింది.
బుధవారం రాత్రి నాలుగు వాహనాల్లో వచ్చిన 50 మంది సాయుధ నక్సల్స్ అకస్మాత్తుగా స్టేషన్ ను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. అనంతరం మందుపాతరను అమర్చి పోలీస్ స్టేషన్ ను పేల్చారు. దీనితో ముగ్గురు పోలీసులు మృతి చెందారు.
అది పెద్ద పోలీసు స్టేషన్ అయినా అక్కడ ఒక్క ఆయుధం కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. నక్సల్స్ ఎత్తుకెళతారనే భయంతో అక్కడ ఆయుధాలు ఉంచలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
