మరో డాక్టర్ పై దాడి
హైదరాబాద్-డాక్టర్లపై దాడులు మరింత పెరుగుతున్నాయి. శుక్రవారం నయాపూల్ లో జూనియర్ డాక్టర్ పై దాడి జరిగి 24 గంటలు గడవక ముందే డాక్టర్లపై మరో దాడి జరిగింది. శ్రీరాం నాయక్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరగడంతో తలకు తీవ్ర గాయమైంది. బంధువులు ఆయనను సనత్ నగర్ ఇఎస్ఐ ఆసుపత్రిలోకి తీసుకువచ్చారు. కేసు సీరియస్ గా ఉండడం తమ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా ఇఎస్ఐ డాక్టర్లు సలహా ఇచ్చారు. ఇందుకు ఆగ్రహించిన బంధువులు డ్యూటీ డాక్టర్ పై చేయిచేసుకున్నారు. మీరు ఆసుపత్రిలో ఉన్నదెందుకనీ బూతులు తిట్టినట్టు దెబ్బలు తిన్న డాక్టర్ ఆ తరువాత మీడియాకు చెప్పారు.
ఇదిలా ఉండగా జూనియర్ డాక్టర్లు మరోమారు ఆందోళన పథంలో పయనిస్తున్నారు. హైదరాబాద్ జూనియర్ డాక్టర్లకు వైజాగ్, విజయవాడ, కర్నూల్ జూనియర్ డాక్టర్లు కూడా మద్ధతు తెలుపుతూ ఆందోళన పథం పట్టారు. సోమవారం నుంచి ఆందోళన చేపడతామంటూ అందు కోసం కార్యాచరణ క్రమాన్ని రూపొందించుకోవడానికి జూనియర్ డాక్టర్లు సమావేశం అయ్యారు.












Click it and Unblock the Notifications
