అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల కాల్చివేత
లూసియానా: అమెరికాలోని లూసియానా యూనివర్సిటిలో దుండగుల కాల్పులకు ఇద్దరు తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు కరీంనగర్ జిల్లాకు చెందిన అల్లం కిరణ్ కుమార్ కాగా మరొకరు కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి. అల్లం కిరణ్ కుమార్ ప్రముఖ రచయిత అల్లం రాజయ్య కుమారుడు. కిరణ్ కు రెండేళ్ల క్రితమే పెళ్లయింది. భార్య స్వప్న నాలుగు నెలల గర్భవతి. కిరణ్ కుమార్ కెమిస్ట్రీలో పిహెడీ చేస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన కూడా వివాహితుడు. గురువారం రాత్రి నల్లజాతికి చెందిన ముగ్గురు కిరణ్ అపార్ట్ మెంట్లోకి జొరబడి కాల్చివేశారు. చంద్రశేఖర్ ఇంట్లోకి వచ్చీరాగానే ఆయన మెడకు కేబుల్ తగిలించి కాల్చివేశారు. రాత్రి 10.30గంటలకు వచ్చిన స్వప్న భర్త మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బు కోసమే ఉన్మాదులు ఈ పని చేసిఉంటారని భావించినా పోలీసులు అది కారణం కాకపోవచ్చని భావిస్తున్నారు.
మృత దేహాలను భారత్ కు తీసుకు రావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. అమెరికన్ కాన్సులేట్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని ఆయన చెప్పాడు. ఎవరైనా బంధువులు అమెరికా వెళ్లదలుచుకుంటే ఏర్పాట్లు చేస్తామని కూడా ఆయన చెప్పాడు. ఇప్పటికే కిరణ్ కుమార్ తండ్రి అల్లం రాజయ్య అమెరికాకు బయలుదేరివెళ్లారు.












Click it and Unblock the Notifications
