ఆంధ్ర, తెలంగాణా ఉద్యోగుల మధ్య జీవో 610 వివాదం
హైదరాబాద్: జీవో 610 అమలు విషయమై సెక్రటేరియట్ తెలంగాణా, ఆంధ్ర ఉద్యోగస్తుల మధ్య వివాదం మొదలైంది. ఒకవైపు నాన్-లోకల్ ఉద్యోగులను వారి సొంత ప్రాంతానికి పంపాలని జీవో610 చెబుతుండగా సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్న మహిళా ఉద్యోగులు, వేరే ప్రాంతంలో పని చేస్తున్న తమ భర్తలను హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేసేలా చర్యలు తీసుకోమని కోరుతుండడంతో ఈ వివాదం మొదలయింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన 610 జీవో అమలు సభా కమిటీ సెక్రటేరియట్ లో శనివారం భేటీ కానున్న నేపథ్యంలో ఆంధ్ర మహిళా ఉద్యోగులు ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందుకు ఆగ్రహించిన తెలంగాణా ఉద్యోగులు ఇందుకు నిరసన తెలిపారు. ఆంధ్ర మహిళా ఉద్యోగుల చర్యలను ఖండిస్తూ వారు నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా మహిళా ఉద్యోగులు కూడా నినాదాలు చేయండంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కల్పించుకుని ఇరు ప్రాంతాలా ఉద్యోగస్తులను అక్కడినుంచి పంపించివేశారు.












Click it and Unblock the Notifications
