గణతంత్ర పెరేడులో బతుకమ్మ
న్యూఢిల్లీ: జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగే పరేడులో రాష్ట్రం నుంచి బతుకమ్మ శకటాన్ని ప్రదర్శించనున్నారు. ప్రతి ఏడాది రాష్ట్రం నుంచి ఏదో ఒక శకటాన్ని ప్రదర్శించడం సంప్రదాయం. ఈసారి బతుకమ్మ శకటాన్ని ప్రదర్శించనున్నారు. ఈ శకటం నమూనాను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకాధికారి వేణుధర్ రెడ్డి ఢల్లీలో ప్రదర్శించారు.
తాము తయారు చేసిన శకటం నమూనాను ప్రదర్శనకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన చెప్పారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఈ శకటాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలో విశేషమైంది. ప్రకృతి నుంచి లభించే పూలను సేకరించి బతుకమ్మను పేర్చి మహిళలు ఒక చోట వాటిని పెట్టి పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడుతారు.












Click it and Unblock the Notifications
