డాక్టర్ల రక్షణకు ఆర్డినెన్స్ జారీ
హైదరాబాద్: ఆస్పత్రుల్లో రక్షణకు ఆర్డినెన్స్ తేవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. జూనియర్ డాక్టర్లను పబ్లిక్ సర్వెంట్సుగా గుర్తిస్తూ కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఉగాది పర్వదినం నుంచి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా పులివెందులలో ఇందిర రీసెర్చ్ లైవ్ స్టాక్స్ ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించాలని కూడా నిర్ణయించింది. విపత్తుల నివారణ వ్యవస్థ స్థాపనను ఆమోదించింది.












Click it and Unblock the Notifications
