జూనియర్ డాక్టర్లపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: వైద్యులు, జూనియర్ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని, సమ్మె తగదని హైకోర్టు హెచ్చరించింది. తమకు రోగులు ముఖ్యమని స్పష్టం చేసింది. సమ్మె చట్టబద్దం కాకపోతే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని కూడా హైకోర్టు హెచ్చరించింది.
సమ్మె చట్టబద్ధమా, కాదా అనే విషయంపై రేపు వాదనలను వినిపించాలని హైకోర్టు జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. కోర్టు ప్రతిష్ట ముఖ్యమని, కోర్టు ధిక్కరణపై విచారణ జరగాల్సిందేనని అభిప్రాయపడింది. సమ్మె కారణంగా రోగులకు వైద్య సేవలు అందించేందుకు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రేపు తమకు తెలియయజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవుట్ సోర్సింగ్, రిటైర్డు వైద్యుల సేవలను వాడుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications
