ఎవరు లేకున్నా సమ్మె ఆగదు: జుడాలు
హైదరాబాద్: ఎవరి మద్దతు ఉన్నా, లేకున్నా తమ సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. తమపై దాడి చేసిన మజ్లీస్ శాసనసభ్యులు అఫ్సర్ ఖాన్, పాషా ఖాద్రీలను అరెస్టు చేసే వరకు తాము సమ్మెను కొనసాగిస్తామని వారు చెప్పారు. ఆర్డినెన్సును చూశాక తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటామని వారు చెప్పారు.
నీలోఫర్ ఆస్పత్రిలో దాడికి నిరసనగా జూనియర్ డాక్టర్లు మొదట సమ్మెకు దిగారు. హైకోర్టు హెచ్చరికలతో, హామీలతో వారు సమ్మెను విరమించుకున్నారు. అయితే నయాపూల్ ఆస్పత్రిలో దాడి జరగడంతో వారు మళ్లీ సమ్మెకు దిగారు. ఈ దాడులకు బాధ్యులైన మజ్లీస్ శాసనసభ్యులు అఫ్సర్ ఖాన్, పాషా ఖాద్రీలను అరెస్టు చేసే వరకు సమ్మెను ఉపసంహరించబోమని వారంటున్నారు.












Click it and Unblock the Notifications
