పేదల హత్యకు అధికారం: అసదుద్దీన్
హైదరాబాద్: వైద్యుల రక్షణకు ఆర్డినెన్సును జారీ చేయడం పేదలను హత్య చేయడానికి అధికారం ఇవ్వడమేనని మజ్లీస్ శాసనసభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి ఆయన సోమవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. ఆర్డినెన్సుకు తమ వ్యతిరేకతను తెలియజేశారు.
జూనియర్ వైద్యుస సమ్మెకు తమ శాసనసభ్యులు కారణం కాదని ముఖ్యమంత్రి తమతో చెప్పినట్లు ఆయన చెప్పారు. జూనియర్ డాక్టర్లు ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఈ పరిణామాలను తాము ఎదుర్కుంటామని ఆయన అన్నారు. ఇఎస్ ఐలో జరిగిన దాడిపై జూనియర్ డాక్టర్లు ఎందుకు మౌనం వహించారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications
