పరారైన నక్సలైట్ల కోసం రాష్ట్రంలో నిఘా
హైదరాబాద్: చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జైలు నుంచి పరారైన మావోయిస్టుల కోసం రాష్ట్రంలో పోలీసులు నిఘా వేస్తున్నారు. వారు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో నిఘాను పటిష్టం చేశారు. దంతెవాడ జైలు నుంచి ఖైదీల పరారీపై రాష్ట్ర డీజీపీ యాదవ్ ఇంటలిజెన్స్, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్ష జరిపారు.
చత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దులతో పాటు నల్లమల అడవులు సహా మావోయిస్టులకు పట్టు ఉన్న ప్రాంతాలలో పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర సరిహద్దులోనూ గాలింపు చర్యలు జరుపుతున్నారు. జైలులో భీభత్సం సృష్టించడం ద్వారా నక్సల్స్ ఆ జైలునుంచి పరారైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లతో పాటు ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications
