పట్టాలు తప్పిన సర్కార్ ఎక్స్ ప్రెస్ బోగీలు
కాకినాడ: పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు సమీపంలో సర్కార్ ఎక్సుప్రెస్ పట్టాలు తప్పింది. చెన్నై నుంచి కాకినాడకు వస్తున్న సర్కార్ ఎక్సుప్రెస్ సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో గేదెలను ఢీకొంది. దీంతో రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ రైలును ఉప్పుటేరు వంతెనపై ఆపేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ సంభవించలేదు.
సింగిల్ ట్రాక్ కావడంతో ఆ దారిలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మూడు ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేశారు. రైలును కైకలూరుకు తరలించారు. ట్రాకును పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications
