ప్రభుత్వ వైద్యుల సమ్మె విరమణ
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లపై దాడికి నిరసనగా సోమవారం చేపట్టిన సమ్మెను ప్రభుత్వాస్పత్రుల వైద్యులు విరమించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో సోమవారం సమావేశమైన అనంతరం వారు సమ్మెను విరమించారు. ఆర్డినెన్స్ జారీకి ముందు తమను సంప్రదించకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
జూనియర్ డాక్టర్లపై దాడికి నిరసనగా ప్రభుత్వ వైద్యులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు స్తంభించాయి. రోగులు విపరీతంగా ఇబ్బందులకు గురయ్యారు.












Click it and Unblock the Notifications
