బుష్ ఎంపిక నా చలువే: కె ఎ పాల్
హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ ను ఆ పదవికి ఎంపిక చేయాలని సిఫార్సు చేసింది తానేనని క్రైస్తవ మత ప్రచారకుడు కె ఎ పాల్ ఏకంగా ఒక "సిక్సర్ " కొట్టారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఎదుర్కొంటున్న కె ఎ పాల్ త్వరలో రాజకీయ పార్టీని వ్యవస్ధాపించనున్నట్టు మరో సారి ప్రకటించారు.
శాంతి స్ధాపనకు కృషి చేస్తానని తనకు ఇచ్చిన హామీని బుష్ నీరుగార్చారని, అందుకే తనకు ఇస్తానన్న ప్రెసిడెన్షీయల్ అవార్డును తీసుకోలేదని పాల్ చెప్పారు. అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తాను కీలక పాత్ర వహించబోతున్నానని ఆయన ప్రకటించుకున్నారు.
రాష్ట్రంలో కాపు, బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీలను కలుపుకుని రాజకీ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు, త్వరలో దాని పేరును వెల్లడించనున్నట్టు ఆయన చెప్పారు. శాంతి బోధనలు చేసే తనకు రాజకీయాలు కూడా తెలుసని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications
