నక్సల్స్ ఘాతుకం: 12 మంది పోలీసుల ఊచకోత
రాయపూర్: చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో మరోసారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. మావోయిస్టులు 12 మంది పోలీసుల ఊచకోతకు పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కిష్టావరం పోలీసు క్యాంపులో అస్వస్థతకు గురైన నలుగురు పోలీసులను గురువారంనాడు వంద మంది పోలీసులు గొల్లపల్లి ఆస్పత్రికి కాలినడకన తీసుకుని వెళ్తుండగా మావోయిస్టులు మెరుపుదాడి చేసి 28 మంది పోలీసులను తీసుకుని వెళ్లారు. వీరిలో 16 మంది పోలీసులు మావోయిస్టుల నుంచి తప్పించుకున్నారు. తమ చేతికి చిక్కిన 12 మంది పోలీసులను మావోయిస్టులు హత్య చేశారు. మర్రిగూడెం సమీపంలో ఆ ఘాతుకం జరిగింది.
పోలీసుల మృతదేహాల కోసం 500 మంది పోలీసులు కుంట నుంచి బయలుదేరారు. మారాయంగూడెంకు 18 కిలోమీటర్ల దూరంలో పోలీసు శవాలు పడి ఉన్నాయి. శవాలను తీసుకురావడానికి పోలీసులు మారాయంగూడెం నుంచి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. మావోయిస్టుల కోసం దంతెవాడ జిల్లాల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఆంధ్రా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులను అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications
