కాంగ్రెస్ చేతకానితనం: రాఘవులు
హైదరాబాద్: కాంగ్రెస్ చేతకానితనం వల్లనే గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) విజయం సాధించిందని సిపియం రాష్ట్ర కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు వ్యాఖ్యానించారు. ఇది బిజెపి గొప్పతనం గానీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గొప్పతనం గానీ కాదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
గుజరాత్ నరమేథం విషయంలో చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. గోద్రా అనంతర నరమేధం విషయంలో దోషులను శిక్షించే విషయంలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన అన్నారు. గుజరాత్ ఫలితాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications