ప్రభుత్వానికి బుద్ధి లేదు: రాఘవులు
ఖమ్మం/ వరంగల్: పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అప్పిలేట్ తీర్పును గౌరవించాలని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. అప్పిలేట్ తీర్పు వచ్చిన తర్వాతనైనా ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని అనుకున్నామని, అయితే ప్రభుత్వమే బుద్ధిలేనిదని ఆయన మంగళవారం ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని రద్దు చేస్తూ వచ్చిన అప్పిలేట్ తీర్పును హైకోర్టు సవాల్ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. పోలవరం ప్రాజెక్టు డిజైనును మార్చాలని ప్రభుత్వాన్ని తాము ఎన్ని సార్లు డిమాండ్ చేసినా ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు.
అప్పిలేట్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. అనుమతిని రద్దు చేస్తూ ఇచ్చిన నిర్ణయంపై స్టే ఇవ్వాలని కోరుతామని ఆయన మంగళవారం వరంగల్లులో మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ విషయంపై అడ్వొకేట్ జనరల్ పరిశీలన జరుపుతున్నారని ఆయన అన్నారు. కొత్త నిబంధనలు పూర్తయిన ప్రాజెక్టులకు కూడా వర్తిస్తాయా అనేది చూడాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
