చిరంజీవికి దాసరి పరామర్శ
హైదరాబాద్: తండ్రిని కోల్పోయిన మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు మంగళవారంనాడు పరామర్శించారు. సోమవారం నాడు ఫోన్ చేసి చిరంజీవికి తన సానుభూతిని తెలియజేసిన దాసరి నారాయణ రావు మంగళవారంనాడు చిరంజీవి ఇంటికి వచ్చారు. చిరంజీవిని పరామర్శించి వెంకట్రావుతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి తండ్రి వెంకట్రావు అంత్యక్రియలు సోమవారంనాడు జరిగిన విషయం తెలిసిందే.
వెంకట్రావు జీవితం స్ఫూర్తిదాయకమని దాసరి నారాయణరావు అన్నారు. వెంకట్రావు ఎంతో క్రమశిక్షణ గల మనిషి అని, ఆ క్రమశిక్షణను వెంకట్రావు తన కుమారులకు అందించారని ఆయన అన్నారు. జగత్ కిలాడీలు సినిమాకు తాను స్క్రిప్టు రాశానని, ఆ సినిమాలో వెంకట్రావు నటించారని, ఆ నటనను కూడా వెంకట్రావు కుమారులకు అందించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
