పులివెందుల చర్చిలో వైయస్ ప్రార్థనలు
హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మంగళవారంనాడు కడప జిల్లా పులివెందులలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి బిసి విద్యార్థిని ఆదుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అతి పెద్దదైన మెదక్ చర్చిలోనూ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రాష్ట్రం నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఈ చర్చికి వచ్చారు.
హైదరాబాదులోని చర్చిల్లో క్రిస్మస్ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పులివెందులలోని జెఎన్ టియులో గ్రంథాలయానికి, ల్యాబ్ కు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.












Click it and Unblock the Notifications
