ప్రేమోన్మాదంతో అయేషాపై అత్యాచారం, హత్య
విజయవాడ: ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయేషా మీరా అనే విద్యార్థిని విజయవాడలోని ఇబ్రహీం పట్నంలో ఉన్న దుర్గ హాస్టల్లో అతి దారుణంగా హత్య చేయబడింది. హత్యకు ముందు దుండగుడు ఆయేషాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమె నిమ్ర కాలేజీలో బీ ఫార్మసీ విద్యార్థిని. క్రిస్మస్ సెలవులకు తెనాలి వెళ్లిన ఆయేషా బుధవారం సాయంత్రమే ఆమె తల్లి ఆయేషాను హాస్టల్ లో వదిలి వెళ్లింది.
అత్యాచారం చేసిన తరువాత హంతకుడు ఆమెను దారుణంగా చంపి నగ్నంగా బాత్ రూమ్ లో పడవేశాడు. ఒక కాలును పైకి కట్టాడు. మోకాలి కిందినుంచి రెడ్ ఇంక్ తో గీతలు గీశాడు. చాతిపై హెచ్.ప్రేమ చిరుత అని రాశాడు. ఆయేషా శవం పక్కన లభ్యం అయిన ఉత్తరంలో ఆయేషా తనను ప్రేమించకపోవడంతోనే హత్య చేసినట్టు రాసి ఉంది. ఆయేషా హాస్టల్ రూమ్ పక్క రూమ్ లో నలుగురు అమ్మాయిలు పడుకొని ఉండగానే ఈ ఘాతుకం జరగడం విస్మయానికి గురిచేస్తోంది. రాత్రి ఒంటిగంట దాకా అందరూ కలిసి చదువుకున్నట్టు తెలుస్తోంది. హాస్టల్ గదిలోనే హత్య చేసిన హంతకుడు ఆమెను బాత్ రూమ్ లోకి ఈడ్చుకువెళ్లాడు...ఆమె బట్టలన్నీ చిందరవందరగా రూమ్ లో పడి ఉన్నాయి. తలపై గాయం చేసిన హంతకుడు ఆయుధాలు ఏవీ వదలకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. హంతకుని ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. ఇంతవరకు ఎలాటిం ఆధారాలు దొరకలేదని, రెండుగంటల పాటు సంఘటనా స్థలంలో ఉన్న విజయవాడ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ చెప్పారు.












Click it and Unblock the Notifications
