పోలవరం కేసు రేపటికి వాయిదా
హైదరాబాద్:పోలవరం ప్రాజెక్టు పై పర్యావరణ పునర్విచారణ కమిటీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన రిట్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. పర్యావరణ పునర్విచారణ కమిటీ ఇచ్చిన అదేశాలను రద్దు చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తన రిట్ లో హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. వాదనలు విన్న బెంచ్ కేసును రేపటికి వాయిదా వేశారు. శుక్రవారం తిరిగి కేసుపై విచారణ సాగుతుంది.












Click it and Unblock the Notifications
