పీజేఆర్ మృతి పార్టీకి తీరని లోటు:ముఖ్యమంత్రి

అనంతరం సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైయస్ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పీజేఆర్ మాజీ మంత్రిగా పనిచేసి ఉన్నందున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని ఆయన తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్ జనార్థన్ రెడ్డి, పీజేఆర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాంగ్ మ్యాన్ కోల్పోయిందని, అలాంటి వ్యక్తి లేని లోటు పూడ్చడం అసాధ్యమని అన్నారు. మంత్రి రాజ్యలక్ష్మి కూడా ఆయన వెంట వచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అలాంటి అరుదైన నాయకుడు మరొకరు లేరని అన్నారు. ఎన్నో సమస్యలపై పీజేఆర్ తో కలిసి పనిచేసిన అనుభవం తమకు ఉందని నారాయణ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఆర్థిక మంత్రి రోషయ్యతో పాటు పలువురు మంత్రులు పీజేఆర్ ఇంటికి తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి వెంకటస్వామి కూడా పీజేఆర్ ఇంటికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరారవు, సినీ నటుడు శ్రీహరి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ తదితరులు పీజేఆర్ భౌతిక కాయాన్ని సందర్శించారు.
ఇదిలా ఉంటే వేలాదిగా ప్రజలు పీజేఆర్ ఇంటికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసేందుకు మురికి వాడలనుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తొలుత జనాన్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఖైరతాబాద్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, యూసుఫ్ గూడ, అమీర్ పేట్ తదితర ప్రాంతాలలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తూ షాపులను మూసివేశారు. చౌరస్తాలలో పీజేఆర్ ఫోటో నుంచి సంతాపసూచకంగా భగవద్గీతను వినిపిస్తున్నారు. ప్రజలు గుమికూడి పీజేఆర్ సేవలను కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications
