తెలంగాణా ఉద్యమానికి తీరని లోటు:గద్దర్, నాయని

కాంగ్రెస్ లో ఉండి తెలంగాణా వాదాన్ని గట్టిగా వినిపించిన పీజేఆర్ మృతి తీరని లోటని ముషీరాబాద్ ఎమ్మెల్యే నాయని నర్సింహ్మారెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పీజేఆర్ స్వతహాగా ధైర్యవంతుడు, కార్మికుల కోసం అహర్నిషలు కృషి చేసిన వ్యక్తి పీజేఆర్ మరణించడం వ్యక్తిగతంగా తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రేటర్ హైదరాబాద్ సమావేశంలో పాల్గొని బయటకు వచ్చిన పీజేఆర్ కారు ఎక్కబోతు ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మార్గమధ్యంలోనే చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు.
పీజేఆర్ భౌతిక కాయాన్ని ఆయన ఇంటికి తరలించారు. ఆయన ఇంటి ఆవరణలో హైదరాబాద్ మున్సిపల్ కార్మికులు విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంట తడి పెట్టించేలా ఉంది. ఆడ మగ అనే తేడా లేకుండా భోరున విలపిస్తున్నారు. కాగా ఆయన మృతికి సంతాప సూచకంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో స్వచ్చంధంగా షాపులు మూసి బందు పాటిస్తున్నారు.












Click it and Unblock the Notifications
