సుఖమెరుగని పోరాట రాజకీయ యోధుడు పీజేఆర్:కిషన్ రెడ్డి
హైదరాబాద్:హర్యానాలో భారతీయ జనతాపార్టీ సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకొని నగరంలో తలపెట్టిన విజయోత్సవాన్ని రద్దు చేశారు. నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి జనార్థన్ రెడ్డికి సంతాప సూచకంగా భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హిమాయత్ నగర్ భారతీయ జనతాపార్టీకి చెందిన ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి స్వయంగా చెప్పారు. రాజకీయాలలో తనకు ఎన్నో తెలియని విషయాలను పీజేఆర్ వివరించేవారని కిషన్ రెడ్డి అన్నారు. సుఖమెరుగని పోరాట రాజకీయ యోధుడు పీజేఆర్ అని ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
