ఒంటరినై పోయాను!!
న్యూ ఢిల్లీ:తాము ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాన్ని కొనసాగించామని, అందుకే తమను ప్రజలు హైదరాబాద్ బ్రదర్స్ అని పిలిచారని, హఠాత్తుగా పి.జనార్థన్ రెడ్డి మరణించడం సొంత అన్న మరణించినట్టుగా ఉందని మరో హైదరాబాద్ బ్రదర్ సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పోరాటం ఆగిపోయినట్టయిందని శశిధర్ రెడ్డి అన్నారు. తాము పోరాటం చేసింది ప్రజల సమస్యలపైనే కానీ సొంత ప్రయోజనాలకోసం కాదని, అలాంటిది ఇపుడు తన సహచరుడు మరణించడం నాకు పూర్తిగా నిరాశను కలిగించే అంశమని అన్నారు. ఇపుడు తాను ఒంటరిని అయిపోయానని శశిధర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications
