వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పీజేఆర్ హఠాన్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews
P Janardan Reddy
హైదరాబాద్:కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్థన్ రెడ్డి(పిజెఆర్) హఠాన్మరణం చెందారు. ఆకస్మికంగా వచ్చిన గుండెపోటుతో కిమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో పీజేఆర్(59) మరణించారు. ఇటీవల ప్రభుత్వాన్ని పలు విషయాలలో నిలదీస్తున్న పిజేఆర్ హఠాన్మరణం చెందడం కాంగ్రెస్ పార్టీని విస్మయానికి గురిచేసింది. అయిదుసార్లు ఎమ్మెల్యేగా అన్నికయిన పిజేఆర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా, కార్మిక నాయకునిగా, ప్రజల మనిషిగా మన్ననలు పొందిన పిజేఆర్ ఆకస్మిక మరణం చెందడం తట్టుకోలేని ఆయన అభిమానులు భోరున విలపిస్తున్నారు. అర్థరాత్రి అపరాత్రి అనకుండా ప్రజలెప్పుడు పిలిచినా అందుబాటులో ఉండే అరుదైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. పలు ట్రేడ్ యూనియన్లకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. 1978లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డితో కలిసి ఫీజేఆర్ ను హైదరాబాద్ బ్రదర్ గా ప్రసిద్ధి గాంచారు.

ఈ ఉదయం గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవంలో పీజేఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. గురువారంనాడు నారాయణగూడలో జరిగిన పార్కు ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం అందలేదు. ఈ విషయాన్ని హిమాయత్ నగర్ ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి ధృవీకరించారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నప్పటికీ ఆయనకు సరైన స్థానం కల్పించకపోవడంతో ఆయన చాలా కాలంగా తీవ్ర వత్తిడికి గురవుతున్నారు. తాజాగా బుధవారంనాడు ఆయన సూరీడుపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ధైర్యంగా సిబిఐని ప్రశ్నించాడు. ఇవన్నీ ఆయనకు తీవ్ర వత్తిడి కలిగించి గుండెపోటు రావడానికి కారణమైన అంశాలని అభిమానులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

పీజేఆర్ మరణించారన్న వార్త విని అన్ని పార్టీల నాయకులు ఆసుపత్రికి చేరుకుని నివాళులు ఆర్పించారు. ముఖ్యమంత్రి, వైయస్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, షబ్బీర్ అలీ తదితరులు పీజేఆర్ భౌతిక కాయాన్ని సందర్శించారు. హన్మంతరావు బోరున విలపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణా నేత కేశవరావు జాదవ్ తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని దోమల్ గూడలోని ఆయన స్వగృహానికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X