పెద్దమ్మ గుడి మూసివేత-రేపు పీజేఆర్ అంత్యక్రియలు
హైదరాబాద్:పీజేఆర్ అంత్యక్రియలు రేపు(శనివారం, 29న) జరగనున్నాయి. అధికార లాంచనాలతో జరగనున్న ఈ అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ వీరప్ప మొయిలీ హాజరుకానున్నారు. ఇప్పటికే ఇక్బాల్ ఇక్కడ ఉన్నారు.
కాగా పీజేఆర్ మృతికి సంతాప సూచకంగా జూబిలీ హిల్స్ లోని పెద్దమ్మ గుడిని శుక్రవారం మూసి వేశారు. రాష్ట్రంలోనే పెద్ద విగ్రహాన్ని పెట్టే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ రానున్న గణేష్ ఉత్సవాన్ని ఆయనకు అంకితం చేస్తామని కన్నీళ్లతో చెప్పారు.
కాగా ఎన్టీఆర్, టి అంజయ్యకు వచ్చినట్టుగా సామాన్య ప్రజానీకం ఆయన భౌతిక కాయం చూడడానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇంతటి పాపులారిటీ ఆయన ప్రజాసేవచేసి సంపాదించారని అక్కడికి వచ్చిన ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. అన్న అంటే ఎపుడైనా అందుబాటులో ఉండే నాయకుడు పి జనార్థన్ రెడ్డి అని వారు ఆయన సేవలను కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications
