మాకు చూపకుండానే తరలిస్తారా...?
హైదరాబాద్:ప్రజల సందర్శనార్థం పీజేఆర్ భౌతిక కాయాన్ని గాంధీ భవన్ లో రెండు గంటల పాటు ఉంచుతామని చెప్పినప్పటికీ కొద్దిసేపట్లోనే తరలించడంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీజేఆర్ మా మనిషి మాకు చూపకుండానే తరలిస్తారా అని మండిపడుతున్నారు. ఇందుకు పీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు జీఎస్ రావు స్పందించారు. సమయాభావం వల్లే భౌతిక కాయాన్ని గాంధీ భవన్ నుంచి తరలించామన్నారు. పీజేఆర్ బంధువులు కూడా తొందరగా తరలించాలని కోరిన మీదటే అలా చేశామన్నారు. ముఖ్యమంత్రి, మిగతా నాయకులు కూడా అంబర్ పేట్ స్మశాన వాటికలోనే నివాళులు అర్పిస్తారని జీఎస్ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications
