పీజేఆర్ అంతిమ యాత్రకు అశేష జనం
హైదరాబాద్: పీజేఆర్ అంతిమ యాత్ర గాంధీ భవన్ నుంచి ప్రారంభమయింది. ఈ అంతిమ యాత్రకు తరలివచ్చిన జనాన్ని చూస్తే హైదరాబాద్ కదలివచ్చిందా అన్నట్టుగా ఉంది. టెలివిజన్ కెమరాలకు చిక్కనంత దూరం యాత్రలో జనం కదులుతున్నారు. అంతిమ యాత్ర ను రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు దగ్గరుండి నడిపిస్తున్నారు. పలు ట్రేడ్ యూనియన్ల సభ్యులు, చింతల్ బస్తీ, యూసఫ్ గూడా, రహమత్ నగర్, బోరబండ, కూకట్ పల్లి, జూబిలీ హిల్స్ నుంచి జనం పెద్దయెత్తున తరలివచ్చారు.












Click it and Unblock the Notifications
