తెలంగాణపై మా నిర్ణయం తిరులేనిది: దేవేందర్‌గౌడ్

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన తెలంగాణా ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ సభలో దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణాపై టీడీపీ వైఖరిని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన పనిలేదన్నారు. తెలంగాణా ప్రజల మనోభావాలు తమకు బాగా తెలుసని ఆయన అన్నారు. తెలంగాణా అంశంపై సందర్భనూసారంగా తేదేపా స్పందిస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణా అంశంపై తేదేపా నిర్ణయం తీసుకోవడం జరిగితే ఇక దానికి తిరుగుండదని ఆయన అన్నారు. కొత్త ఏడాదిలో చారిత్రాత్మక డైరీ రానుందని, కావాలంటే రాసి పెట్టుకోండని ఆయన సభనుద్ధేశించి అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయో వేచిచూడంటంటూ ఆయన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో దేవేందర్‌గౌడ్ మాట్లాడడానికి సిద్ధమవుతున్న సమయంనుంచే సభికుల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణా అనుకూల నినాదాలు వినిపించసాగాయి. దేవేందర్ మైకు దగ్గరికి చేరే సమయానికి ఈ నినాదాలు మరింత పెద్దవయ్యాయి.
దీంతో కొంత అసహనానికి గురైన దేవేందర్‌గౌడ్ తెలంగాణాపై తేదేపా నిర్ణయాన్ని ప్రతిసారి అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంపై పార్టీ త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు తీసుకోనుందని అన్నారు.












Click it and Unblock the Notifications
