జలంధర్ జైలులో ఖైదీల విధ్వంసం
జలంధర్: జలంధర్ కేంద్ర కారాగారంలో ఖైదీలు సోమవారంనాడు విధ్వంసానికి దిగారు. జైలుకు నిప్పంటించారు. పోలీసు అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. అల్లరి మూకను అదుపులోకి తేవడానికి పోలీసులు కాల్పులు జరిపారు.
దాదాపు 1500 మంది ఖైదీలు జైలుకు నిప్పు పెట్టారు. జైలు అధికారులపై రాళ్లు రువ్వారు. ఖైదీలను అదుపు చేయడానికి జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. ఖైదీల మధ్య ఘర్షణ దీనికి దారి తీసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
