వైయస్ ను కూడా లెక్క చేయను: కాకా
కరీంనగర్: తాను శాసనసభ్యులనే కాదు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా లెక్క చేయనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి అన్నారు. తాను మంత్రులు జీవన్ రెడ్డి, జి. చిన్నారెడ్డిలను అసలే లెక్క చేయనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన పవరేమిటో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీకి తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ రావడమో, తాను చావడమో జరగాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications