సోనియాను దోషి చేస్తున్నారు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని దోషిగా నిలబెడుతున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభా పక్ష నేత జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణకు అడ్డూ లేను నిలువూ లేను అంటూ సోనియానే అడ్డుగా ఉన్నారని ముఖ్యమంత్రి చెబుతున్నారని ఆయన శుక్రవారం శాసనసభలో అన్నారు.
తెలంగాణ వస్తే కాంగ్రెసుతో వస్తుందని, కాంగ్రెసుతో రాకుంటే బిజెపితో వస్తుందని, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితిలతో రాదని ఆయన అన్నారు. తాము ప్రణబ్ ముఖర్జీ కమిటీని గుర్తించడం లేదని, అందుకే ప్రణబ్ కమిటీ తమ అభిప్రాయం చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తమకు లేఖ రాస్తే తాము జవాబు ఇస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్లమెంటులో బిల్లు పెడితే తాము బేషరతుగా బలపరుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
