అదే వరుస: తెరాస ఎమ్మెల్యేల సస్పెన్షన్

హైదరాబాద్: తెలంగాణ అంశంపై సభా కార్యక్రమాలను స్తంభింపజేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులను స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి శాసనసభ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు సస్పెండ్ చేశారు. సభ శుక్రవారం సమావేశం కాగానే తెరాస తెలంగాణ అంశంపై, తెలుగుదేశం పార్టీ పెట్రో ధరల పెంపుపై వాయిదా తీర్మానం ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ తిరస్కరించారు. అందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది.

తెరాస సభ్యులు గులాబీ కుండువా వేసుకున్న సోనియా చిత్రాలు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ వారిని సభనుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కు గురైన తెరాస సభ్యులు శాసనసభ ఆవరణలో ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిని, కాంగ్రెస్ ను ప్రజలు సస్పెండ్ చేస్తారని తెరాస శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు అడ్డంగా నిలబడ్డారని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను కాశ్మీర్ సమస్యతో ముఖ్యమంత్రి పోల్చడాన్ని ఆయన తప్పు పట్టారు. సోనియా అలా చెప్పమన్నారా అని ఆయన అడిగారు. కాంగ్రెస్ వైఖరిని ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి హిందూ ముస్లిం తగాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాదని ముఖ్యమంత్రి చెప్పారని, ఈ విషయాన్ని ప్రజలకు చెప్తామని ఆయన అన్నారు. తెలంగాణపై సభలో తీర్మానం పెడితే ముఖ్యమంత్రి బండారం బయటపడుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి చెప్పిన విషయమే మళ్లీ మళ్లీ చెప్తున్నారని, అందుకే సభా కార్యక్రమాలను స్తంభింపజేశామని తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు చెప్పారు. మంద, అధికార బలాలతో కాంగ్రెస్ తమను సభ నుంచి సస్పెండ్ చేయించారని ఆయన అన్నారు. గురువారంనాడు తెరాస సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసి ఎత్తివేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+