చిరంజీవి పార్టీని ప్రజలు కోరుతున్నారు: జోగయ్య

విజయవాడ: చిరంజీవి పార్టీ పెట్టే విషయంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని నర్సాపురం లోక్ సభ సభ్యుడు చేగొండి హరిరామ జోగయ్య చెప్పారు. బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాజకీయ పార్టీ పెట్టమని చిరంజీవిని ప్రజలే ఆహ్వానిస్తున్నారని జోగయ్య తెలిపారు. ఈ విషయంలో చిరంజీవికి వ్యతిరేకంగా ఎన్ టిఈవీ చేసిన సర్వే బోగస్ అని ఆయన చెప్పారు. ఆంధ్రా, తెలంగాణలను విడదీయడంలో ఇక నాన్చుడు ధోరణి పనికి రాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
