స్పీకర్ ను కలిసేది లేదు: హరీష్
హైదరాబాద్: తాము స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిని కలిసేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు స్పష్టం చేశారు. రాజీనామాలపై తెరాస శాసనసభ్యులతో మాట్లాడ్తానని స్పీకర్ చెప్పిన నేపథ్యంలో ఆయన బుధవారం ఆ వివరణ ఇచ్చారు. తాము రాజీనామాలను ఉపసంహరించుకోమని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాడుతుందనే గ్యారంటీ ఉంటే తప్ప తాము రాజీనామాలను ఉపసంహరించుకోబోమని ఆయన అన్నారు.
తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని, ఈ స్థితిలో తాము ప్రజల వద్దకు వెళ్లడం తప్ప గత్యంతరం లేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరగాల్సిందేనని, ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ సెంటిమెంటు ఎంత బలంగా ఉందో తెలియజేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, తెలంగాణ అభివృద్ధికి తాము ఎంతో కృషి చేశామని, కానీ కాంగ్రెస్ ఏ మాత్రం ముందుకు రాలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications