పేలుళ్ల కేసు: కోర్టులో నాసిర్
హైదరాబాద్: బెంగుళూర్ పేలుళ్ల కేసులో అరెస్టయిన నాసిర్ ను పోలీసులు బుధవారంనాడు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. హైదరాబాద్ పేలుళ్లతోనూ అతనికి సంబంధం ఉందని పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) కార్యాలయంలో పేల్చివేతకు కూడా అతను కుట్ర పన్నినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. నాసిర్ కు ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే పోలీసుల ఆరోపణలను నాసిర్ తల్లి ఖండిస్తోంది. తన కుమారుడికి పేలుళ్లతో ఏ విధమైన సంబంధం లేదని, తన కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అంటోంది. పోలీసుల ఆరోపణలను తన కుమారుడు అంగీకరించడం లేదని ఆమె చెప్పింది. పోలీసులు ధర్డ్ డిగ్రీ ఉపయోగించి బలవంతంగా ఒప్పించే ప్రమాదం ఉందని ఆమె విమర్శిస్తోంది.












Click it and Unblock the Notifications