తెరాస గెలుస్తుంది: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాలు చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే తెరాస గెలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు అన్నారు. అయితే ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయో, రావో ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. తెరాస రాజీనామాల వల్ల అంతా గందరగోళం చోటు చేసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెరాస ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం అనవసరమని, తెలంగాణ అంశంపై వారు మరి కొంత కాలం ఆగాల్సిందని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంటును నిరూపించడానికి ఈ నెల 24వ తేదీన తలపెట్టిన తమ సభపై మళ్లీ మాట్లాడుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ సభను నల్లగొండ జిల్లా భువనగిరిలో తలపెట్టారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని, ఎన్నికలు వస్తే తెరాస గెలుస్తుందని ఎమ్మెస్సార్ అన్నారు.












Click it and Unblock the Notifications