హైకోర్టుకు అవినీతి ఐఎఎస్ ల చిట్టా

హైదరాబాద్: ఆరుగురు అవినీతి ఐఎఎస్ అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు మంగళవారం సమర్పించింది. ఒక ఐఎఎస్ అధికారి షఫిక్ - యు - జమాన్ సమాచార హక్కు చట్టం కింద వేసిన కేసుపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అవినీతి ఐఎఎస్ అధికారుల జాబితా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సునీల్ ఖత్రి, బి. దానం, ఉమామల్లేశ్వర రావు, ఎం.వి. సత్యనారాయణ, సి. సత్యనారాయణ, రమాలక్ష్మణ్ ల పేర్లను రాష్ట్రం ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. వీరిలో ఐదుగురు రిటైర్డ్ అధికారులే కావడం విశేషం. అనంతరం కేసు విచారణను హైకోర్టు మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా వేసింది.

తిరిగి విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవినీతి ఐఎఎస్ అధికారుల అరకొర జాబితాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినీతి ఐఎఎస్ అధికారులు ఆరుగురైనా అని హైకోర్టు ప్రశ్నించింది. అవినీతి అధికారుల పూర్తి జాబితాను తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది. 2002-2003లో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అవినీతి ఐఎఎస్ అధికారులను తెలియజేస్తూ వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా వారిపై కేసులు ఉపసంహరించుకుందని పిటిషనర్ ఆరోపించారు. తనకు ఆ జాబితాను ఇవ్వడం లేదంటూ సమాచార హక్కు కింద హైకోర్టులో పిటిషన్ వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+