చిరంజీవి బ్యానర్ ధ్వంసం: ఉద్రిక్తత
విజయవాడ: కృష్ణా జిల్లా కృష్ణలంకలో మెగాస్టార్ చిరంజీవి బ్యానర్ ధ్వంసం కావడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తమ అభిమాన నటుడు చిరంజీవి బ్యానర్ ను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ వారు రాస్తారోకోకు దిగారు. చిరంజీవి అభిమానులు పెద్ద యెత్తున కృష్ణలంకకు చేరుకున్నారు. ఆదివారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
చిరంజీవి బ్యానర్ ను ధ్వంసం చేసిందెవరనే విషయం తెలియడం లేదు. ఇక్కడ చిరంజీవి వ్యతిరేకులు కూడా ఉన్నారు. అభిమానుల్లోనూ వర్గాలున్నాయి. అయితే వీరెవరైనా ఆ పని చేశారా, ఆకతాయిలు ఈ పనికి ఒడిగట్టారా అనే విషయం తెలియడం లేదు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆదివారంనాడు కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ కార్యకర్తలు చిరంజీవి బ్యానరును ధ్వంసం చేశాని కాపునాడు ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications