మే 1న బిజెపి అభ్యర్థుల జాబితా
కరీంనగర్: ఉప ఎన్నికల్లో పోటీ అభ్యర్థుల పేర్లను మే 1వ తేదీన ప్రకటిస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రత్యేక తెలంగాణ, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలలే తమ ఎన్నికల ఎజెండా అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తమ పార్టీ కార్యకర్తలు అన్ని స్థానాల్లో పోటీ చేయాడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే రాజకీయ వ్యూహంగా తాము ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. మే 1వ తేదీన తాము పోటీ చేసే స్థానాలను, అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. వామపక్షాలు ఎన్నికల సమీకరణలపైననే ప్రత్యేకంగా దృష్టి పెట్టారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications