తెలంగాణలో ప్రవేశించిన చంద్రబాబు మీకోసం యాత్ర

అంతకుముందు గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.ఆరు రోజుల్లో 301 కిమీలు చుట్టడం ద్వారా ఆయన తన గుంటూరు జిల్లా యాత్రను పూర్తి చేశారు. ప్రధానంగా వినుకొండ, నరసరావుపేట, చిలకలూరి పేట, తాడికొండ, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో పర్యటించారు.
పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతూ ముందుకు సాగారు. టీడీపీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం హింసిస్తోందని, మరో తొమ్మిది నెలలు ఓపిక పడితే అన్నీ సరిపోగలదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
