గుంటూరు మిర్చి యార్డులో భారీ అగ్ని ప్రమాదం
గుంటూరు: దేశ ప్రఖ్యాతి గాంచిన గుంటూరు మిర్చి యార్డులో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు ఎగిసి పడడంతో అనేక దుకాణాల్లోని మిర్చి దగ్ధం కావడంతో దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన మిర్చి దగ్ధమైనట్టు ప్రాధమిక సమాచారం.
వందల సంఖ్యలో ఉన్న కమిషన్ దుకాణాల్లో దాదాపు 70 శాతం భస్మాపటలమయ్యాయి.అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ప్రమాద నివారణ చర్యలు చేపట్టినా లాభం లేకపోయింది. ఈ రోజు యార్డుకు సెలవు కావడంతో 450 దుకాణాలు భస్మాపటలమయ్యాయి. మొత్తం మిర్చి యార్డులో కొన్ని వందల క్వింటాళ్ళ మిర్చి భస్మీపటలమైనట్టు సమాచారం. మిర్చి యార్డు సమీపంలోని దాదాపు 200 గుడిసెలు దగ్ధమైనట్టు తెలుస్తోంది. ప్రమాదానికీ కారణాలు తెలియరావడం లేదు.












Click it and Unblock the Notifications
