హైదరాబాద్: పార్టీకి కార్యకర్తలే వెన్నెముకలని, వారిని విస్మరిస్తే పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కష్టమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పట్ల ఆయన శుక్రవారం సున్నితంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగాలని ఆయన అన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోనే తాను పునరంకిత సభకు హాజరు కాలేదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిగా డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్లు ఉండాలని, ఉంటారని ఆయన అన్నారు. అయితే నిజమైన కార్యకర్తలను గుర్తించినప్పుడే పార్టీ తిరిగి అధికారంలోకి రాగలుగుతుందని ఆయన అన్నారు.