తెలంగాణపై మాకే చిత్తశుద్ధి: వైయస్

తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు ఏ విధమైన మేలు చేయలేదని ఆయన విమర్శించారు. తొమ్మిదేళ్లలో చేయలేని మేలు మళ్లీ అధికారంలోకి వస్తే ఎలా చేయగలుగుతారని చంద్రబాబును అడగాలని ఆయన ప్రజలను కోరారు. నాలుగేళ్ల పాటు తమ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసిందని, తాము చేసిన మంచి పనుల్లో గత తెలుగుదేశం తన 9 ఏళ్ల పాలనతో ఒక్కటి కూడా చేయలేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. ఇందిరమ్మ గృహాల్లో అవకతవకలు లేవని, అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లు రుజుపు చేస్తే వేయి రూపాయలు బహుమానంగా ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications