నేనేం చిన్న పిల్లవాణ్ని కాను: తలసాని

హైదరాబాద్: ఎవరో చెప్తే మాట్లాడడానికి తాను చిన్న పిల్లవాడినేమీ కానని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తమ పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు ప్రోద్బలంతోనే తాను దేవేందర్ గౌడ్ పై విమర్శలు చేసినట్లు వచ్చిన వ్యాఖ్యలపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో గుర్రుమన్నారు. తాను పార్టీలో సీనియర్ సభ్యుడినని, మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలిచానని, తన అభిప్రాయాలను చెప్పే హక్కు తనకు ఉందని ఆయన అన్నారు.

సికింద్రాబాద్ నుంచి గెలిచిన తర్వాత తాను మర్యాదపూర్వకంగా దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్లానని, ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్లలేదని ఆయన అన్నారు. ఇలాగే మాట్లాడితే తాను దేవేందర్ గౌడ్ ఇంట్లో కాలు పెట్టబోనని ఆయన అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని దేవేందర్ గౌడ్ ను అనలేదని, దేవేందర్ గౌడ్ వెళ్లిపోయినా పార్టీకి నష్టమేమీ లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+