ప్రపంచ వండర్ అవుతుంది: దేవేందర్

తెలుగుదేశం పార్టీలో తనకు అవకాశం కల్పించానని చంద్రబాబునాయుడు అనడాన్ని ఆయన తప్పు పట్టారు. సమాజంలో సమానావకాశాలు ఉండవా, అవకాశాలను అందుకోవడానికి తాము పనికి రామా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయని, కాంగ్రెసు ముఖ్యమంత్రి రాజశేఖరెడ్డి చుట్టు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయని, ఆ పార్టీల్లో ప్రజలకు భాగస్వామ్యం లేదని ఆయన అన్నారు. తాము ప్రజా భాగస్వామ్యంతో ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. చిన్నపాటి రాయితీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
