హైదరాబాద్: రాష్ట్రంలో ఫిబ్రవరి తర్వాతే ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఇందిరమ్మ గృహనిర్మాణ, పావలా వడ్డీ తదితర పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాల కలెక్టర్ల సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆయన మంగళవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పుడే ఎన్నికలు వస్తే రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దెబ్బతింటాయని అధికారులు వెల్లిబుచ్చిన సందేహానికి వైఎస్ పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ఎన్నికలు తదితర అంశాల గురించి కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారని అధికార వర్గాలు వెల్లడించాయి.