ఇండియన్ ఎంబసీ వద్ద పేలుడు: 28 మంది మృతి
కాబూల్: కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 28 మంది మరణించినట్లు సమాచారం. పరిస్థితిని సమీక్షించేందుకు భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మాహుతి దాడిలో దాదాపు 141 మంది గాయపడినట్లు సమాచారం. పలు ఆస్పత్రుల నుంచి అందిన సమాచారం మేరకు ఈ లెక్కలు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఫహీం చెప్పారు.
పేలుడులో దౌత్య కార్యాలయం వెలుపల ఉన్న నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. ఆత్మాహుతి కారు బాంబు పేలుడు వల్ల ఈ విధ్వంసం జరిగినట్లు ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెమరాల్ బషీరీ చెప్పారు. మృతులెంతమంది అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. కాబూల్ లో ఇటీవలి కాలంలో వరుసగా పేలుళ్లు సంభవిస్తున్నాయి.












Click it and Unblock the Notifications